2 కొరింథీయులకు 9:8-10
2 కొరింథీయులకు 9:8-10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అన్ని విషయాల్లో, అన్నివేళల్లో మీకు కావలసినవన్ని కలిగి ఉండి, ప్రతి మంచి కార్యంలో సమృద్ధిగా ఉండేలా దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించగలరు. దీని గురించి ఇలా వ్రాయబడి ఉంది: “వారు ధారాళంగా బహుమానాలను పేదలకు పంచిపెట్టారు. వారి నీతి నిరంతరం నిలిచి ఉంటుంది.” విత్తువానికి విత్తనాలు, తినడానికి రొట్టె సమకూర్చే దేవుడు మీకు విత్తనం ఇచ్చి ఫలింపజేస్తారు, మీ నీతి పంటను విస్తరింపజేస్తారు.
2 కొరింథీయులకు 9:8-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అన్నిటిలో మీకు చాలినంతగా ఎప్పుడూ ఉండేలా, ప్రతి మంచి పని కోసమూ మీకు సమృద్ధి ఉండేలా దేవుడు మీలో తన కృపను అధికం చేయగలడు. దీని గురించి “అతడు తన సంపద దరిద్రులకు పంచి ఇచ్చాడు. అతని నీతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది” అని లేఖనంలో రాసి ఉంది. విత్తనాలు చల్లేవారికి విత్తనాన్నీ తినడానికి ఆహారాన్నీ దయచేసే దేవుడు మీకు విత్తనాన్ని దయచేసి వృద్ధి చేస్తాడు. మీ నీతి ఫలాన్ని అధికం చేస్తాడు.
2 కొరింథీయులకు 9:8-10 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు దేవుడు మీకవసరమున్నదాని కన్నా ఎక్కువే యిస్తాడు, మీకు అవసరమున్నవన్నీ అన్ని వేళలా మీకు లభించేటట్లు చెయ్యటమే కాకుండా సత్కార్యాలు చెయ్యటానికి కావలిసినవి సమృద్ధిగా యిస్తాడు. దీన్ని గురించి లేఖనాల్లో ఇలా వ్రాసారు: “అతడు పేదలకు ధారాళంగా యిచ్చాడు అతని నీతి చిరకాలం ఉంటుంది.” రైతుకు విత్తనాలు, తినటానికి ఆహారము యిచ్చే దేవుడే మీ పంటను సమృద్ధిగా పండించటానికి కావలసిన విత్తనాలు యిస్తాడు. తద్వారా మీ నీతికి ఫలం కలిగిస్తాడు.
2 కొరింథీయులకు 9:8-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడియున్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి, మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యముగలవారగునట్లు, మీ నీతిఫలములు వృద్ధిపొం దించును.