2 కొరింథీయులకు 3:17-18
2 కొరింథీయులకు 3:17-18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఇప్పుడు ప్రభువే ఆత్మ. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉన్నాడో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. కాబట్టి ముసుగు తొలగిన ముఖాలతో ఆత్మయైన ప్రభువు నుండి వచ్చే ఆయన మహిమను ప్రతిబింబిస్తూ, అంతకంతకు అధికమయ్యే ఆయన మహిమ రూపంలోనికి మనమందరం మార్చబడుతున్నాము.

2 కొరింథీయులకు 3:17-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ప్రభువే ఆత్మ. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటాడో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది. మనమంతా ముసుకు లేని ముఖాలతో ప్రభువు వైభవాన్ని చూస్తూ, అదే వైభవపు పోలిక లోకి క్రమక్రమంగా మారుతూ ఉన్నాము. ఇది ఆత్మ అయిన ప్రభువు ద్వారా జరుగుతున్నది.
2 కొరింథీయులకు 3:17-18 పవిత్ర బైబిల్ (TERV)
ప్రభువే “ఆత్మ”. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వేఛ్చ ఉంటుంది. ముసుగు తీసివేయబడ్డ మా ముఖాల్లో ప్రభువు మహిమ ప్రకాశిస్తోంది. అది ఆత్మ అయినటువంటి ప్రభువు నుండి వచ్చింది. అనంతమైన ఆ మహిమ మమ్మల్ని ప్రభువులా మారుస్తోంది.
2 కొరింథీయులకు 3:17-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ప్రభువే ఆత్మ . ప్రభువుయొక్క ఆత్మ యెక్కడ నుండునో అక్కడ స్వాతంత్యమునుండును. మన మందరమును ముసుకులేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము.