1 రాజులు 13:16-18
1 రాజులు 13:16-18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అందుకు ఆ దైవజనుడు, “నేను తిరిగి మీతో రాలేను, మీతో కలిసి ఈ స్థలంలో భోజనం గాని, నీళ్లు గాని పుచ్చుకోలేను. యెహోవా వాక్కు ద్వారా నేను ఇలా ఆదేశించబడ్డాను: ‘నీవు అక్కడ భోజనం చేయవద్దు, నీళ్లు త్రాగవద్దు, నీవు వచ్చిన దారిన తిరిగి వెళ్లవద్దు’ అని యెహోవా వాక్కు ద్వారా నేను ఆదేశించబడ్డాను” అన్నాడు. ఆ వృద్ధుడైన ప్రవక్త జవాబిస్తూ, “నీలాగే నేను కూడా ప్రవక్తనే. యెహోవా వాక్కు ద్వారా దేవదూత నాతో, ‘అతడు భోజనం చేసి నీళ్లు త్రాగేలా అతన్ని నీతో పాటు నీ ఇంటికి తీసుకురా’ అన్నాడు” అని చెప్పాడు. (కాని అతడు అబద్ధమాడాడు.)
1 రాజులు 13:16-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అతడు “నేను నీతో రాలేను. నీ ఇంటికి రాను. నీతో కలిసి ఇక్కడ ఏదీ తిననూ తాగను. నీవు అక్కడ ఏదీ తినొద్దనీ తాగొద్దనీ నీవు వచ్చిన దారిలో వెళ్ళ వద్దనీ యెహోవా నాతో చెప్పాడు” అన్నాడు. అప్పుడు ఆ ముసలి ప్రవక్త అతనితో “నేను కూడా నీలాంటి ప్రవక్తనే. యెహోవా ఆజ్ఞ ప్రకారం ఒక దేవదూత ‘భోజనం చేయడానికి అతన్ని వెంటబెట్టుకుని తీసుకు రా’ అని నాతో చెప్పాడు” అన్నాడు. అలా అతడు ఆ దేవుని మనిషితో అబద్ధమాడాడు.
1 రాజులు 13:16-18 పవిత్ర బైబిల్ (TERV)
కాని దైవజనుడిలా అన్నాడు: “నేను నీతో రాలేను. నీతో ఈ ప్రదేశంలో అన్నపానాదులు తీసుకోలేను. ‘అక్కడ నీవేదీ తినరాదు; తాగరాదు. నీవు వెళ్లిన దారిన తిరిగి రాకూడదు; అని కూడ యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాడు.’” “కాని నేను కూడా నీలాగే ఒక ప్రవక్తను” అన్నాడు ఆ వృద్ధ ప్రవక్త. అతడు ఒక అబద్ధం కూడా చెప్పాడు. “యెహోవా యొక్క దేవదూత నావద్దకు వచ్చాడు. ఆ యెహోవా యొక్క దేవదూత నిన్ను నా ఇంటికి తీసుకుని వెళ్లమని, నాతో నీవు భోజనాదులు చేసేలా అనుమతివ్వమనీ అన్నాడు” అని చెప్పాడు.
1 రాజులు 13:16-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అతడు–నేను నీతోకూడ మరలి రాజాలను, నీ యింట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను –నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరుగవద్దనియు యెహోవా వాక్కుచేత నాకు సెలవాయెనని చెప్పెను. అందుకతడు–నేనును నీవంటి ప్రవక్తనే; మరియు దేవదూత యొకడు–యెహోవా చేత సెలవుపొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని నీ యింటికి తోడుకొని రమ్మని నాతో చెప్పెనని అతనితో అబద్ధమాడగా