1 రాజులు 10:13 - Compare All Versions

1 రాజులు 10:13 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

రాజైన సొలొమోను షేబ రాణికి తన రాజ నిధి నుండి ఇచ్చింది మాత్రమే కాక, ఆమె కోరిందంతా, అడిగినదంతా ఇచ్చాడు. తర్వాత ఆమె తన పరివారంతో తన స్వదేశానికి వెళ్లిపోయింది.

షేర్ చేయి
1 రాజులు 10 TSA

1 రాజులు 10:13 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

సొలొమోను తన వైభవానికి తగిన విధంగా షేబ దేశపు రాణికిచ్చింది కాకుండా, దానికి మించి ఆమె కోరిన వాటన్నిటినీ ఆమెకు ఇచ్చాడు. అప్పుడు ఆమె తన పరివారంతో కలిసి తన దేశానికి తిరిగి వెళ్ళింది.

షేర్ చేయి
1 రాజులు 10 IRVTEL

1 రాజులు 10:13 TERV (పవిత్ర బైబిల్)

సాటి రాజ్యాధినేతకు ఒక రాజు ఎలాంటి కానుకలు ఇస్తాడో, ఆలాగున రాజైన సొలొమోను షేబ దేశపు రాణికి కానుకలు ఇచ్చాడు. పైగా ఆమె అడిగిన ఇతర వస్తువులను కూడా ఆమెకు సమర్పించాడు. ఆ తరువాత రాణి, ఆమె పరివారము తమ దేశానికి వెళ్లి పోయారు.

షేర్ చేయి
1 రాజులు 10 TERV

1 రాజులు 10:13 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబదేశపు రాణికిచ్చినదిపోగ ఆమె కోరినప్రకారము ఆమె యిచ్ఛాపూర్తిగా ఆమె కిచ్చెను; అప్పుడు ఆమెయు ఆమె సేవకులును తమ దేశమునకు తిరిగి వెళ్లిరి.

షేర్ చేయి
1 రాజులు 10 TELUBSI