1 దినవృత్తాంతములు 1:28-31 - Compare All Versions
1 దినవృత్తాంతములు 1:28-31 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వీరి తరములు ఏవనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు తరువాత కేదారు అద్బయేలు మిబ్శాము మిష్మా దూమా మశ్శా హదదు తేమా యెతూరు నాపీషు కెదెమా; వీరు ఇష్మాయేలు కుమారులు.
1 దినవృత్తాంతములు 1:28-31 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అబ్రాహాము కొడుకులు ఇస్సాకు, ఇష్మాయేలులు. వీళ్ళ సంతానం వివరాలు ఇవి. ఇష్మాయేలు పెద్దకొడుకు నెబాయోతు. ఇతని తరువాత పుట్టిన వాళ్ళు, కేదారు, అద్బయేలు, మిబ్శామూ, మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా, యెతూరు, నాపీషు, కెదెమా. వీళ్ళు ఇష్మాయేలు కొడుకులు.
1 దినవృత్తాంతములు 1:28-31 TERV (పవిత్ర బైబిల్)
అబ్రాహామునకు ఇస్సాకు, ఇష్మాయేలు అను ఇరువురు కుమారులు. ఇష్మాయేలు సంతానం ఎవరనగా: ఇష్మాయేలు ప్రథమ పుత్రుడు నెబాయోతు. ఇష్మాయేలు ఇతర కుమారులెవరనగా కేదారు, అద్బయేలు, మిబ్శాము, మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా, యెతూరు, నాపీషు, కెదెమా అనువారు. వీరంతా ఇష్మాయేలు కుమారులు.
1 దినవృత్తాంతములు 1:28-31 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అబ్రాహాము కుమారులు: ఇస్సాకు, ఇష్మాయేలు. వీరు వారి సంతానం: ఇష్మాయేలు యొక్క మొదటి కుమారుడు నెబాయోతు, కేదారు, అద్బీయేలు, మిబ్శాము, మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా, యెతూరు, నాపీషు, కెదెమా. వీరు ఇష్మాయేలు కుమారులు.