కీర్తనల గ్రంథము 63:1-5
కీర్తనల గ్రంథము 63:1-5 TERV
దేవా, నీవు నా దేవుడవు. నాకు నీవు ఎంతగానో కావాలి. నా ఆత్మ, నా శరీరం నీళ్లులేక ఎండిపోయిన భూమిలా నీకొరకు దాహంగొని ఉన్నాయి. అవును, నీ ఆలయంలో నేను నిన్ను చూశాను. నీ బలము నీ మహిమలను నేను చూశాను. నీ ప్రేమ జీవం కన్నా గొప్పది. నా పెదాలు నిన్ను స్తుతిస్తున్నాయి. అవును, నా జీవితంలో నేను నిన్ను స్తుతిస్తాను. నీ పేరట నేను నా చేతులెత్తి నీకు ప్రార్థిస్తాను. శ్రేష్ఠమైన ఆహారం భుజించినట్లు నేను తృప్తిపొందుతాను. నా నోరు నిన్ను స్తుతిస్తుంది.

