1
మార్కు 7:21-23
పవిత్ర బైబిల్
TERV
ఎందుకంటే, మానవుల హృదయాల నుండి దురాలోచనలు, జారత్వం, దొంగతనం, నరహత్యలు, వ్యభిచారం, లోభం, చెడుతనం, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం బయటకు వస్తాయి. ఇవే లోపలనుండి బయటకు వచ్చి నరుని అపవిత్రం చేస్తాయి.”
సరిపోల్చండి
మార్కు 7:21-23 ని అన్వేషించండి
2
మార్కు 7:15
బయట ఉన్నవేవీ మనిషి కడుపులోకి వెళ్ళి అతణ్ణి అపవిత్రం చేయవు.
మార్కు 7:15 ని అన్వేషించండి
3
మార్కు 7:6
యేసు సమాధానంగా, “యెషయా వేషధారులైన మిమ్మల్ని గురించి సరిగ్గా ప్రవచించాడు. అతడు తన గ్రంథంలో ఇలా ప్రవచించాడు: ‘వీళ్ళు మాటలతో నన్ను గౌరవిస్తారు. కాని వాళ్ళ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి.
మార్కు 7:6 ని అన్వేషించండి
4
మార్కు 7:7
వాళ్ళు మానవ కల్పితమైన నియమాలను బోధిస్తారు. కనుక వాళ్ళ ఆరాధన నిరర్థకం.’
మార్కు 7:7 ని అన్వేషించండి
5
మార్కు 7:8
దేవుని ఆజ్ఞల్ని పాటించటం మానేసి, మానవుడు కల్పించిన ఆచారాల్ని పట్టుకొని మీరు పాటిస్తున్నారు.
మార్కు 7:8 ని అన్వేషించండి