1
యెషయా 30:21
పవిత్ర బైబిల్
TERV
అప్పుడు మీరు తప్పుచేసి, తప్పు మార్గంలో పోతే (కుడికి కావచ్చు, ఎడమకు కావచ్చు) “ఇదే సరైన మార్గం, మీరు ఇలా వెళ్లాలి” అని ఒక స్వరం మీ వెనుకనుండి చెప్పటం మీరు వింటారు.
సరిపోల్చండి
యెషయా 30:21 ని అన్వేషించండి
2
యెషయా 30:18
యెహోవా మీకు తన దయ చూపించాలని కోరుతున్నాడు. యెహోవా కనిపెడ్తున్నాడు. యెహోవా లేచి, మిమ్మల్ని ఆదరించాలని కోరుతున్నాడు. యెహోవా దేవుడు న్యాయవంతుడు, యెహోవా సహాయం కోసం వేచి ఉండే ప్రతి వ్యక్తి ఆశీర్వదించబడతాడు.
యెషయా 30:18 ని అన్వేషించండి
3
యెషయా 30:15
“మీరు తిరిగి నా దగ్గరకు వస్తే మీరు రక్షించబడుతారు. మీరు నన్ను విశ్వసిస్తే, మీకు ఉన్న ఒకే బలం మీకు వస్తుంది. అయితే మీరు మౌనంగా ఉండాలి” అంటున్నాడు ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు, యెహోవా, నా ప్రభువు. కానీ అలా చేయటం మీకు ఇష్టం లేదు.
యెషయా 30:15 ని అన్వేషించండి
4
యెషయా 30:20
గతంలో నా ప్రభువు (దేవుడు) మీకు దుఃఖం, విచారం ఇచ్చాడు. అది మీరు ప్రతిరోజూ రొట్టెతిన్నట్లు నీళ్లు తాగినట్టుగా ఉండేది. అయితే, దేవుడు మీ ఉపదేశకుడు, ఆయన ఇకమీదట మీనుండి దాగు కొని ఉండడు. మీ ఉపదేశకుని మీరు మీ కళ్లారా చూస్తారు.
యెషయా 30:20 ని అన్వేషించండి
5
యెషయా 30:19
యెహోవా ప్రజలు సీయోను కొండమీద యెరూషలేములో నివసిస్తారు. మీరు ఏడుస్తూనే ఉండరు. యెహోవా మీ ఏడ్పువింటాడు, ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. యెహోవా మీ మొర వింటాడు. ఆయన మీకు సహాయం చేస్తాడు.
యెషయా 30:19 ని అన్వేషించండి
6
యెషయా 30:1
యెహోవా చెప్పాడు, “ఈ పిల్లల్ని చూడండి. వాళ్లు నాకు లోబడరు. వాళ్లు పథకాలు వేస్తారు గాని సహాయం చేయమని నన్ను అడగరు. ఇతర దేశాలతో వారు ఒడంబడికలు చేసుకుంటారు. కానీ నా ఆత్మ ఆ ఒడంబడికలను కోరటంలేదు. ఈ ప్రజలు ఇంకా మరిన్ని పాపాలు వారికి చేర్చుకొంటున్నారు.
యెషయా 30:1 ని అన్వేషించండి