1
ప్రకటన గ్రంథం 3:20
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
IRVTel
చూడండి, నేను తలుపు దగ్గర నిలబడి తలుపు కొడుతున్నాను. ఎవరైనా నా మాట విని తలుపు తీస్తే నేను లోపలికి అతని దగ్గరికి వస్తాను. నేను అతనితో కలసి భోజనం చేస్తాను. అతడూ నాతో కలసి భోజనం చేస్తాడు.
సరిపోల్చండి
ప్రకటన గ్రంథం 3:20 ని అన్వేషించండి
2
ప్రకటన గ్రంథం 3:15-16
నీ పనులు నాకు తెలుసు. నువ్వు చల్లగా లేవు, వేడిగా కూడా లేవు. నువ్వు చల్లగానో, వేడిగానో ఉంటే మంచిది. నువ్వు చల్లగానైనా వేడిగానైనా ఉండకుండాా గోరువెచ్చగా ఉన్నావు. కాబట్టి నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మిలా ఊసేద్దామనుకుంటున్నాను.
ప్రకటన గ్రంథం 3:15-16 ని అన్వేషించండి
3
ప్రకటన గ్రంథం 3:19
నేను ప్రేమించేవారిని మందలిస్తాను. శిక్షిస్తాను. కాబట్టి చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడు.
ప్రకటన గ్రంథం 3:19 ని అన్వేషించండి
4
ప్రకటన గ్రంథం 3:8
నీ పనులు నాకు తెలుసు. చూడు, నీ ఎదుట తలుపు తీసి ఉంచాను. దాన్ని ఎవరూ మూయలేరు. నీ బలం స్వల్పమే అయినా నా వాక్కుకు విధేయత చూపావు. నా నామాన్ని తిరస్కరించలేదు.
ప్రకటన గ్రంథం 3:8 ని అన్వేషించండి
5
ప్రకటన గ్రంథం 3:21
నేను విజయం సాధించి నా తండ్రితో కలసి ఆయన సింహాసనం మీద కూర్చున్నట్టే జయించేవాణ్ణి నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోనిస్తాను.
ప్రకటన గ్రంథం 3:21 ని అన్వేషించండి
6
ప్రకటన గ్రంథం 3:17
‘నేను ఆస్తిపరుణ్ణి, నా డబ్బు పెరిగిపోతూ ఉంది, నాకే లోటూ లేదు’ అని నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ నీకు తెలియనిదేమిటంటే నీవొక నిర్భాగ్యుడివి, దీనావస్థలో ఉన్నావు, దరిద్రుడివి, గుడ్డివాడివి. బట్టలు లేవు.
ప్రకటన గ్రంథం 3:17 ని అన్వేషించండి
7
ప్రకటన గ్రంథం 3:10
ఓర్పుతో సహించాలన్న నా ఆదేశానికి నువ్వు కట్టుబడి ఉన్నావు. కాబట్టి భూమిపై నివసించే వారిని పరిశోధించడానికి లోకం మీదికి రాబోయే పరీక్షా కాలంలో నేను నిన్ను కాపాడతాను.
ప్రకటన గ్రంథం 3:10 ని అన్వేషించండి
8
ప్రకటన గ్రంథం 3:11
నేను త్వరగా వస్తున్నాను. నీ కిరీటాన్ని ఎవరూ తీసుకోకుండా నీకున్న దాన్ని గట్టిగా పట్టుకో.
ప్రకటన గ్రంథం 3:11 ని అన్వేషించండి
9
ప్రకటన గ్రంథం 3:2
జాగ్రత్త పడు. చావడానికి సిద్ధంగా ఉన్న మిగిలిన వాటిని బలపరచుకో. ఎందుకంటే నీ పనులు నా దేవుని ముందు నాకు సంపూర్ణంగా కనిపించడం లేదు.
ప్రకటన గ్రంథం 3:2 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు