1
నెహెమ్యా 7:1-2
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
IRVTel
నేను సరిహద్దు గోడలు కట్టి, తలుపులు నిలబెట్టిన తరువాత కాపలా కాసేవాళ్లను, గాయకులను, లేవీయులను నియమించాను. తరువాత నా సహోదరుడు హనానీ, కోట అధికారి హనన్యాలకు యెరూషలేం బాధ్యతలు అప్పగించాను. హనన్యా అందరికంటే ఎక్కువగా దేవుడంటే భయం గల నమ్మకమైన వ్యక్తి.
సరిపోల్చండి
నెహెమ్యా 7:1-2 ని అన్వేషించండి
2
నెహెమ్యా 7:3
అప్పుడు నేను “బాగా పొద్దెక్కే దాకా యెరూషలేం ద్వారాలు తెరవ వద్దు. ప్రజలంతా దగ్గరగా నిలబడి ఉన్నప్పుడు ద్వారపాలకులు తలుపులు మూసి వాటికి అడ్డగడియలు పెట్టాలి. అంతేకాక, యెరూషలేంలో నివాసముండే వారంతా తమ వంతుల ప్రకారం తమ ఇళ్ళకు ఎదురు కాపలా కాసేలా నియమించుకోవాలి” అని చెప్పాను.
నెహెమ్యా 7:3 ని అన్వేషించండి