1
లేవీ 26:12
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
IRVTel
నేను మీ మధ్య సంచరిస్తాను. మీకు దేవుడినై ఉంటాను. మీరు నాకు ప్రజలై ఉంటారు.
సరిపోల్చండి
లేవీ 26:12 ని అన్వేషించండి
2
లేవీ 26:4
వర్షాకాలంలో మీకు వర్షం ఇస్తాను. మీ భూమి పంటలనిస్తుంది. మీ పొలాల్లో చెట్లు ఫలిస్తాయి.
లేవీ 26:4 ని అన్వేషించండి
3
లేవీ 26:3
మీరు నా శాసనాలను బట్టి నడుచుకుంటూ నా ఆజ్ఞలను పాటిస్తూ వాటిని అనుసరించి ప్రవర్తించాలి.
లేవీ 26:3 ని అన్వేషించండి
4
లేవీ 26:6
ఆ దేశంలో నేను మీకు క్షేమం కలిగిస్తాను. మీరు పండుకొనేటప్పుడు ఎవరూ మిమ్మల్ని భయపెట్టరు. ఆ దేశంలో క్రూరమృగాలు లేకుండా చేస్తాను. మీ దేశంలోకి ఖడ్గం రాదు.
లేవీ 26:6 ని అన్వేషించండి
5
లేవీ 26:9
ఎందుకంటే నేను మిమ్మల్ని కరుణించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థిరపరుస్తాను.
లేవీ 26:9 ని అన్వేషించండి
6
లేవీ 26:13
మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండ వారి దేశంలోనుండి మిమ్మల్ని రప్పించాను. నేను మీ దేవుడైన యెహోవాను. నేను మీ కాడి అడ్డకొయ్యలు విరగగొట్టి మిమ్మల్ని తలెత్తుకుని నడిచేలా చేశాను.
లేవీ 26:13 ని అన్వేషించండి
7
లేవీ 26:11
నా మందిరాన్ని మీ మధ్య ఉంచుతాను. మీ విషయం నా మనస్సు అసహ్యపడదు.
లేవీ 26:11 ని అన్వేషించండి
8
లేవీ 26:1
“మీరు విగ్రహాలను చేసుకోకూడదు. చెక్కిన ప్రతిమను గానీ దేవతా రాతి స్తంభాన్ని గానీ నిలబెట్టకూడదు. మీ దేశంలో మీరు మొక్కడానికి చెక్కిన రాతి బొమ్మను నిలబెట్టకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను.
లేవీ 26:1 ని అన్వేషించండి
9
లేవీ 26:10
మీరు చాలా కాలం నిలవ ఉన్న పాత ధాన్యం తింటారు. కొత్తది వచ్చినా పాతది మిగిలి ఉంటుంది.
లేవీ 26:10 ని అన్వేషించండి
10
లేవీ 26:8
మీలో ఐదుగురు వంద మందిని తరుముతారు. వంద మంది పదివేల మందిని తరుముతారు, మీ శత్రువులు మీ ఎదుట కత్తివాత కూలిపోతారు.
లేవీ 26:8 ని అన్వేషించండి
11
లేవీ 26:5
మీ ద్రాక్ష పండ్లకాలం వరకూ మీ పంట నూర్పు కొనసాగుతుంది. మీరు తృప్తిగా తిని మీ దేశంలో నిర్భయంగా నివసిస్తారు.
లేవీ 26:5 ని అన్వేషించండి
12
లేవీ 26:7
మీరు మీ శత్రువులను తరుముతారు. వారు మీ ఎదుట కత్తివాత కూలుతారు.
లేవీ 26:7 ని అన్వేషించండి
13
లేవీ 26:2
నేను నియమించిన విశ్రాంతి దినాలను మీరు ఆచరించాలి. నా పరిశుద్ధ మందిరాన్ని పవిత్రంగా చూడాలి. నేను యెహోవాను.
లేవీ 26:2 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు