ఇశ్రాయేలీయులను గురించి తెకోవలోని గొర్రెల కాపరి ఆమోసు చూసిన దర్శనంలోని విషయాలివి. యూదారాజు ఉజ్జియా రోజుల్లో ఇశ్రాయేలు రాజు యెహోయాషు కొడుకు యరొబాము రోజుల్లో భూకంపం రావడానికి రెండేళ్ళు ముందు, అతడు ఈ దర్శనం చూశాడు. అతడు ఇలా చెప్పాడు,
“యెహోవా సీయోను నుంచి గర్జిస్తున్నాడు.
యెరూషలేము నుంచి తన గొంతు పెంచి వినిపిస్తున్నాడు.
కాపరుల మేతభూములు దుఃఖిస్తున్నాయి.
కర్మెలు పర్వత శిఖరం వాడిపోతున్నది.”