ఉచిత పఠన ప్రణాళికలు మరియు ఫిలిప్పీయులకు 2:5 కు సంబంధించిన వాక్య ధ్యానములు

వైఖరి
7 రోజులు
ప్రతి పరిస్థితిలో సరైన వైఖరి కలిగి ఉండటం ఒక నిజమైన సవాలు. అనుదినము చిన్న ప్రకరణము చదువుట ద్వారా ఈ ఏడు రోజుల ప్రణాళిక మీకు సరైన బైబిల్ దృక్కోణాన్ని ఇస్తుంది. ప్రకరణము చదివి, నిజాయితీగా మిమ్మల్ని పరిశీలించుకొనుటకు సమయము గడపండి, మీ యొక్క పరిస్థితిని గూర్చి దేవుడిని మాట్లాడనివ్వండి. మరింత సమాచారం కోసం, finds.life.church చూడండి

పశువుల పాకకు ప్రయాణము
25 రోజులు
2000 సంవత్సరముల క్రితం, ఒకానొక నిశ్శబ్ద రాత్రి వేళ, రక్షకుని జననమును గూర్చిన వార్తను దూతలు, మందలను కాయుచున్న గొర్రెల కాపరుల యొద్దకు మోసుకొని వచ్చెను. ఆ వార్తను వినిన పిమ్మట, ఆ కాపరులు సమస్తమును విడిచిపెట్టి, బెత్లెహేములో పశువుల పాకలో నున్నఒక బాలుని వెదకుటకు బయలువెళ్ళెను. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా, ఆ ఆహ్వానము మార్పు చెందలేదు. డా. చార్లెస్ స్టాన్లీ గారితో కలిసి, ఆ రక్షకుని దగ్గరగా చేరుటకు నీకు సహాయపడుతూ మరియు ఈ క్రిస్మస్ వేళలో తండ్రి ప్రేమలో ఒదిగి విశ్రాంతి తీసుకొనుటకు వీలు చేసుకకొనుమని ఆయన నిన్ను ప్రోత్సహించును