ఉచిత పఠన ప్రణాళికలు మరియు మత్తయి 7:3 కు సంబంధించిన వాక్య ధ్యానములు

ధృడముగా - లీసా బేవెర్ గారితో
6 రోజులు
సత్యము అంటే ఏమిటి? సత్యము, కాలంతో పాటే మారుతూ ఉండే ఒక ప్రవహించే నది వంటిదనే అబద్ధాన్ని మన సంస్కృతి నమ్ముతుంది. కానీ సత్యము అనేది ఒక నది వంటిది కాదు కాని, అది స్థిరమైన ఒక బండ లాంటిది. అంతే కాకుండా, మహా సముద్రమంత భిన్నాభిప్రాయాలు కలిగి, దశా దిశా లేకుండా ఉన్న ఈ లోకంలో, మిమ్మల్ని ఒక స్పష్టమైన మార్గంలో నడిపిస్తూ, మీ ఆత్మ నడిపింపుకు ఒక లంగరు వలె ఈ ప్రణాళిక మీకు సహాయపడుతుంది.

అందని దానికొరకు పడే తాపత్రయం
7 రోజులు
మనమందరము ఎల్లపుడు ఏదో ఒక దానిని వెంటాడుతూనే ఉంటాము. సాధారణముగా అది మనకు అందీ అందనట్లుగానే ఉంటుంది - ఒక మంచి ఉద్యోగం, చక్కటి ఇల్లు, ఒక పరిపూర్ణ కుటుంబము లేక ఇతరుల నుండి మెప్పు వంటివి అయివుండవచ్చు. కానీ ఇదంతా ఏంతో ప్రయాసముతో కూడినదిగా ఉంది కదూ? దీని కన్నా మెరుగైన మార్గము లేదా? పాస్టర్ క్రైగ్ గ్రోషేల్ గారి సందేశముల సముదాయమైన, "చేసింగ్ కారేట్స్" నుంచి సేకరించబడి, Life.Church వారిచే రూపొందించబడిన ఈ బైబిల్ ప్రణాళికలో దీనికి సరైన సమాధానమును కనుగొనండి.