ఉచిత పఠన ప్రణాళికలు మరియు యోహాను 15:4 కు సంబంధించిన వాక్య ధ్యానములు

అంతా ప్రశాంతం: ఈ క్రిస్మస్ వేళలో యేసుని సమాధానము పొందుకొనుట
5 రోజులు
ఈ పండుగ కాలము కేవలము ఉల్లాసభరితమైనదే కాక తీరిక కూడా దొరకని హడావుడి సమయము. ఈ పండుగ కాలపు పనుల వత్తిడి నుండి సేద దీరి ఆనందపు ఘడియలలో కొనసాగుటకు మన పనులను ప్రక్కన పెట్టి కొంత సమయము ఆయనను ఆరాధిద్దాము. అన్ రాప్పింగ్ ది నేమ్స్ ఆఫ్ జీసస్: ఎడ్వెంట్ డివోషనల్ అను పుస్తకం ఆధారంగా, ఈ 5-రోజుల ఆధ్యాత్మిక పఠన ప్రణాళిక ఆయన మంచితనమును గుర్తు చేసుకొనుటకు, మనకు ఆయన యొక్క అవసరతను తెలుపుతూ, ఆయన నెమ్మదిని కనుగొనుటకు, మరియు ఆయన నమ్మకత్వమును విశ్వసిస్తూ ఈ క్రిస్మస్ సమయములో యేసు అనుగ్రహించే విశ్రాంతిని పొందుకొనుటకు మిమ్మును నడిపించును.

యేసు మాత్రమే
9 రోజులు
ఈ గందరగోళ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు గురించి మరింత తెలుసుకోడానికి యెంచుకోండి, అనిశ్చిత సమయాల్లో భయం విషయంలో విశ్వాసం కలిగియుండడానికి యెంచుకోండి. మీరు ఈ ప్రణాళికను చదువుతున్నప్పుడు ప్రతీ దినం ఏమి జరుగుతున్నప్పటికీ భవిష్యత్తులోనికి ధైర్యంగా అడుగు పెడతారని మేము నిరీక్షిస్తున్నాము.

విధేయత
2 వారాలు
యేసే తనను ప్రేమించే వాడు తన బోధన కూడా ఒప్పుకొని పాటిస్తాడు అని చెప్పాడు. అది మనకు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చుతో కూడుకున్నప్పటికీ, మన యొక్క విధేయత దేవునికి ఎంతో ముఖ్యమైనది. "విధేయత" ప్రణాళిక పఠనం లేఖనాలు విధేయత గురించి ఏమి చెబుతున్నాయో ఆ విషయాలగుండా నడిపిస్తుంది: సమగ్రమైన ఆలోచన విధానమును, దయాళుత్వము ఎలా కొనసాగించవచ్చో మరియు మన జీవితాలకు విధేయత ఎలా విముక్తినిస్తుంది మరియు మన జీవితాలను ఆశీర్వదిస్తుంది, మరియు ఇంకా ఎన్నో.