విశ్రాంతి లేని వారికి విశ్రాంతిਨਮੂਨਾ

ఆత్మీయ పాఠము
మొదటి రోజు: నీవు ఆహ్వానించబడిన వాడవు!
ఈ రోజు నీవు మునుపెన్నడు పొందుకొనని ఓ గొప్ప ఆహ్వానాన్ని పొందుకొని యున్నావు. నమ్మ శక్యముగా లేదా? ఇది నిజము. ఈ ఆహ్వానాన్ని గొప్ప ఆహ్వానము ఎందుకు అంటున్నానంటే ఈ ఆహ్వానాన్ని ఎవరైతే ఇస్తున్నారో ఆయన నిత్యము పూజ్యనీయుడు. ఈ ఆహ్వానాన్ని ఇస్తున్నది మరిఎవరో కాదు యేసు క్రీస్తే. ఆయన ఇచ్చిన ఈ నమ్మశక్యము కాని ఆహ్వానాన్ని గూర్చి మత్తయి 11:28లో మనము చూడగలము. అచ్చట యేసు ప్రభువు వారు ఈలాగు పల్కెను, “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.”
ఈ ఆహ్వానము ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్తమైన వారికి ఇవ్వబడినది. ఈ పిలుపు ఏ లోటు లేని వారికి ఇచ్చిన పిలుపు కాదు లేదా గర్విష్ఠులకు, పొగరు పట్టిన వారికి ఇచ్చినది కాదు. బాధకరమైన విషయము ఏమిటంటే చాలామంది ప్రజలు కృంగిపోయిన స్తితిలో ఉన్ననూ దానిని ఒప్పుకొనుటకు ఇష్ఠపడరు. ఎందుకంటే వారి అహం వారికి అడ్డుగా ఉండి వాస్తవాన్ని ఒప్పుకొన లేని స్తితిలో ఉంటుంటారు. వారికి దైవిక సహాయము అవసరమైయున్నదని వారు గుర్తించరు. అందుచేత, యేసు ప్రభువు వారు ప్రయాసపడి భారభరిత జీవితాన్ని అనుభవిస్తున్న వారిని ఆహ్వానిస్తున్నారు. ఈ వాక్య భాగములో ‘ప్రయాసపడి భారము మోసికొనుచున్న‘ అను ఉప వాక్యము ఇతరులు మనపై మోపిన అత్యధిక భారములను (చట్టపరమైన నియమాలు) సూచించుచున్నది (మత్తయి 23:4 మరియు లూకా 11:46 లను చదవండి).
సంప్రదాయ యూదులు తమ మత సంబంధిత నియమ నిబంధనల చేత అణచివేయబడే వారు. వారు మోషే నిబంధనలో వ్రాయబడియున్న 613 ఆజ్ఞలలో ప్రతి దానిని తప్పక అనుసరించవలసియుండేది. అంతమాత్రమే కాక యూదా సాంప్రధాయములో పేర్కొనబడిన మరి అనేక నియమాలను నిబంధనలను పాఠించవలసిన వారైయున్నారు. యూదులు “నీవు అది చేయకూడదు ఇది చేయకూడదు“ అనే మాటల ప్రతిధ్వనులతోనే తమ తమ జీవితాలను వెల్లబుచ్చే వారు. కాని ‘ధర్మశాస్తాన్ని అనుసరించుట ద్వారా మనము రక్షించబడలేము ‘ అని బైబిల్ తెలియజేయుచున్నది (గలతీ 2:16).
నీవు పాప భారముతో, అపరాధ భావముతో కృంగిపోయి ఉన్నావా (కీర్తనలు 38:3-4)? ఆలాగైతే, యేసు ప్రభువు వారు మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తున్నాడు. మత్తయి 11:28 లో విశ్రాంతి అను పదమునకు అర్ధము రక్షణ. నీ మట్టుకు నీవు నీ స్వంత శక్తితో లేదా మంచి కార్యములు చేయుట ద్వారా నీ భారముల నుండి విముక్తి పొందలేవు, రక్షణ అనే మోక్షాన్ని పొందలేవు. మంచి కార్యాలనేవి రక్షించబడిన వ్యక్తిలో కనబడే ఫలాలే కాని రక్షణకు మూలాధారములు కావు. అయితే, నీవు రక్షించబడుటకు కావలసిన ప్రతిదీ క్రీస్తు నీ కొరకు చేసియున్నాడు. నీవు చేయవలసినదల్లా సాదారణ విశ్వాసముతో నీవ చేసిన పాపముల విషయమై పశ్చాత్తాప హృదయముతో యేసు నొద్దకు వచ్చి క్షమించమని ఆయనను అడుగుటయే. యేసు ఏమని ఆహ్వానించారు? ‘ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్తమైన వారలారా‘ అని. దీని అర్ధాన్ని మనము జాగ్రత్తగా గుర్తించవలెను. అది ఏమిటంటే ఈ ఆహ్వానము అందరికి ఇవ్వబడినది. ఎందుకంటే ఆయన ‘సమస్తమైన వారలారా ‘ అని పిలిచెను. నీవు ఏ జాతి వాడవు, ఏ మతము వాడవు, ఏ ప్రాంతపు వాడవు, ఏ రంగు వాడవు అన్న వ్యత్యాసము లేదు. నీవు ఎవరవైనప్పటికి యేసు నిన్ను ఆహ్వానిస్తున్నారు. ఈ ఆహ్వానము నీ కొరకే!
ਪਵਿੱਤਰ ਸ਼ਾਸਤਰ
About this Plan

ఈ ఆత్మీయ పాఠములు దేవుని అన్వేశించు వారికి క్రీస్తును కనుగొనుటకు, విశ్వాసులైన వారికి కలిగే కష్టనష్టములలో క్రీస్తుయందు విశ్రాంతి పొందుకొనుటకు సహాయపడుతుంది.
More
Related Plans

Praying the Psalms

Stormproof

Greatest Journey!

Breath & Blueprint: Your Creative Awakening

Returning Home: A Journey of Grace Through the Parable of the Prodigal Son

Holy, Not Superhuman

Stop Living in Your Head: Capturing Those Dreams and Making Them a Reality

Faith in Hard Times

Homesick for Heaven
