హెబ్రీ పత్రిక 8
8
యేసు మన ప్రధాన యాజకుడు
1మనం చెప్తున్న దానిలోని ముఖ్య సారాంశమిది: పరలోకంలో సర్వోన్నతుని సింహాసనం యొక్క కుడి వైపున కూర్చుని ఉన్న వానిని మనం ప్రధాన యాజకునిగా కలిగి ఉన్నాం, 2ఆయన మానవుని చేత కాక దేవుని చేత తయారుచేయబడిన నిజమైన ప్రత్యక్షగుడారంలో అతిపరిశుద్ధమైన స్థలంలో ప్రధాన యాజకునిగా పరిచర్య చేస్తున్నాడు.
3ప్రతి ప్రధాన యాజకుడు దేవునికి కానుకలను బలులను అర్పించడానికి నియమించబడి ఉన్నాడు కాబట్టి ఈయన కూడ దేవునికి ఏదైనా సమర్పించాల్సిన అవసరం ఉండింది. 4ఆయన భూమి మీద ఉండి ఉంటే, ఒక యాజకుడై ఉండేవాడు కాడు, ధర్మశాస్త్రంలో వ్రాసి ఉన్న ప్రకారం అర్పణలు అర్పించే యాజకులు ఇప్పటికే ఉన్నారు. 5పరలోకంలో ఉన్న దానికి కేవలం ఒక నమూనాగా ఛాయాచిత్రంగా ఉన్న పరిశుద్ధ స్థలంలో యాజకులుగా వారు సేవ చేస్తారు. ఇందుకే మోషే గుడారాన్ని నిర్మిస్తున్నప్పుడు దాన్ని గురించి ఇలా హెచ్చరిక పొందాడు: “పర్వతం మీద నేను నీకు చూపించిన నమూనా ప్రకారమే ప్రతిదీ చేసేలా చూడాలి.”#8:5 నిర్గమ 25:40 6అయితే నిజానికి నూతన నిబంధన మరింత గొప్ప వాగ్దానాలపై స్థాపించబడింది కాబట్టి, యేసు మధ్యవర్తిగా ఉన్న ఈ నిబంధన గత నిబంధన కన్న శ్రేష్ఠమైనదైనట్లే ఆయనకు అప్పగించబడిన పరిచర్య కూడా శ్రేష్ఠమైనదే.
7అయితే మొదటి నిబంధన లోపం లేనిదైతే, రెండవ దాని కోసం వెదకాల్సిన అవసరమే లేదు. 8అయితే దేవుడు ప్రజల్లో దోషాన్ని కనుగొని ఇలా చెప్పారు:#8:8 కొ.ప్ర.లలో దోషము కనుగొని ప్రజలతో ఇలా చెప్పారు అని తర్జుమా చేయబడింది
“ప్రభువు ఇలా ప్రకటిస్తున్నారు, ఆ రోజులు వస్తున్నాయి,
అప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలతోనూ
యూదా ప్రజలతోనూ
క్రొత్త నిబంధన చేస్తాను.
9ఆ నిబంధన, ఈజిప్టు దేశం నుండి నేను వారి పూర్వికుల
చేయి పట్టుకొని బయటకు నడిపించినపుడు
నేను వారితో చేసిన
నిబంధనలా ఉండదు,
ఎందుకంటే వారు నా నిబంధనకు నమ్మకంగా నిలబడలేదు,
అందుకే నేను వారి నుండి దూరమయ్యాను,
అని ప్రభువు చెప్తున్నారు.
10ఆ కాలం తర్వాత, ఇశ్రాయేలు ప్రజలతో
నేను స్థాపించే నిబంధన ఇదే అని ప్రభువు ప్రకటిస్తున్నారు.
వారి మనస్సులో నా న్యాయవిధులను ఉంచుతాను
వారి హృదయాల మీద వాటిని వ్రాస్తాను.
నేను వారి దేవుడనై ఉంటాను,
వారు నా ప్రజలై ఉంటారు.
11ఇకపై వారిలో ఎవ్వరూ తమ పొరుగువారికి బోధించరు,
‘ప్రభువును తెలుసుకోండి’ అని ఒకరికొకరు చెప్పుకోరు,
ఎందుకంటే వారిలో సామాన్యులు మొదలుకొని గొప్పవారి వరకు
అందరు నన్ను తెలుసుకుంటారు.
12ఎందుకంటే నేను దయతో వారి దుష్టత్వాన్ని క్షమించి
వారి పాపాలను ఇక ఎన్నడు జ్ఞాపకం చేసుకోను.”#8:12 యిర్మీయా 31:31-34
13ఆయన ఈ నిబంధనను, “క్రొత్త” అని పిలువడం చేత మొదటి దాన్ని వాడుకలో లేకుండ చేశారు; వాడుకలో లేనివి పాతవి త్వరలో అదృశ్యమవుతాయి.
Právě zvoleno:
హెబ్రీ పత్రిక 8: TSA
Zvýraznění
Kopírovat
Porovnat
Sdílet
Chceš mít své zvýrazněné verše uložené na všech zařízeních? Zaregistruj se nebo se přihlas
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.