1 కొరింథీయులకు 15:14-19

1 కొరింథీయులకు 15:14-19 TELOV-BSI

మరియు క్రీస్తు లేపబడియుండనియెడల మేముచేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే.౹ దేవుడు క్రీస్తును లేపెనని, ఆయననుగూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము గదా? మృతులు లేపబడనియెడల దేవుడాయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము.౹ మృతులు లేపబడని యెడల క్రీస్తు కూడ లేపబడలేదు.౹ క్రీస్తు లేప బడనియెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే యున్నారు.౹ అంతేకాదు, క్రీస్తునందు నిద్రించినవారును నశించిరి.౹ ఈ జీవితకాలముమట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము.
TELOV-BSI: పరిశుద్ధ గ్రంథము OV Bible (BSI)
Share

1 కొరింథీయులకు 15:14-19

Share