1
గలతీయులకు వ్రాసిన లేఖ 6:9
పవిత్ర బైబిల్
TERV
కనుక మనం విశ్రాంతి తీసుకోకుండా మంచి చేద్దాం. మనము విడువకుండా మంచి చేస్తే సరియైన సమయానికి మంచి అనే పంట కోయగలుగుతాము.
Compare
Explore గలతీయులకు వ్రాసిన లేఖ 6:9
2
గలతీయులకు వ్రాసిన లేఖ 6:10
మనకు మంచి చేసే అవకాశం ఉంది కనుక అందరికీ మంచి చేద్దాం. ముఖ్యంగా విశ్వాసులకు మంచి చేద్దాం.
Explore గలతీయులకు వ్రాసిన లేఖ 6:10
3
గలతీయులకు వ్రాసిన లేఖ 6:2
పరస్పరం కష్టాలు పంచుకోండి. అప్పుడే క్రీస్తు ఆజ్ఞను పాటించినవాళ్ళౌతారు.
Explore గలతీయులకు వ్రాసిన లేఖ 6:2
4
గలతీయులకు వ్రాసిన లేఖ 6:7
మోసపోకండి, ప్రతి ఒక్కడూ తాను నాటిన చెట్టు ఫలాన్నే పొందుతాడు. ఈ విషయంలో దేవుణ్ణి మోసం చెయ్యలేము.
Explore గలతీయులకు వ్రాసిన లేఖ 6:7
5
గలతీయులకు వ్రాసిన లేఖ 6:8
శారీరిక వాంఛలు అనే పొలంలో విత్తనం నాటితే మరణాన్ని ఫలంగా పొందుతాడు. పరిశుద్ధాత్మను మెప్పించే విధంగా నాటితే పరిశుద్ధాత్మ నుండి అనంతజీవితం అనే ఫలం పొందుతాడు.
Explore గలతీయులకు వ్రాసిన లేఖ 6:8
6
గలతీయులకు వ్రాసిన లేఖ 6:1
నా సోదరులారా! మీలో ఎవరైనా పాపం చేస్తే, మీలో ఆత్మీయంగా జీవిస్తున్నవాళ్ళు అతన్ని సరిదిద్దాలి. ఇది వినయంగా చెయ్యాలి. కాని మీరు స్వతహాగా ఆ పాపంలో చిక్కుకుపోకుండా జాగ్రత్త పడండి.
Explore గలతీయులకు వ్రాసిన లేఖ 6:1
7
గలతీయులకు వ్రాసిన లేఖ 6:3-5
తనలో ఏ గొప్పతనమూ లేనివాడు, తాను గొప్ప అని అనుకొంటే తనను తాను మోసం చేసుకొన్నవాడౌతాడు. ప్రతి ఒక్కడూ తన నడవడికను స్వయంగా పరీక్షించుకోవాలి. అప్పుడు తాను మరొకరితో పోల్చుకోకుండా తన నడతను గురించి గర్వించవచ్చు. ప్రతి ఒక్కడూ తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
Explore గలతీయులకు వ్రాసిన లేఖ 6:3-5
Home
Bible
Plans
Videos